చిరుత దాడిలో లేగ దూడ మృతి:
చిరుత దాడిలో లేగ దూడ మృతి:
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట ఏప్రిల్ 21:

నారాయణ పేట జిల్లాలోని మద్దూర్ మండలం పెదిరిపాడ్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులందరూ భయంతో పరుగులెత్తారు.
సందర్భంగా స్థానిక రైతు రామాంజనేయులుకు చెందిన బర్రె దూడపై రాత్రి దాడి చేసి చంపేసింది. వెంటనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లేగ దూడపై చిరుత దాడిని చేసిందని నిర్ధారించారు.
ఈ ఘటనను గ్రామస్తులకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తం చేశారు. బోన్ వేసి చిరుతను బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు వివరించారు.