ఘనంగా చంద్రబోస్ జన్మదిన వేడుకలు.

ఆస్కార్ అవార్డు గ్రహిత సినీ గేయరచయిత చిట్యాల

జ్ఞానతెలంగాణ చిట్యాల మే 10:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగే ప్రాంతానికి చెందిన చంద్రబోస్ జన్మదిన వేడుకలను జూకల్ గ్రామానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ మ్యాదరి సునిల్, ప్రధాన కార్యదర్శి జెట్టి శంకర్ ల చేయూత స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అఖిల చేతుల మీదిగా పండ్లు, బ్రేడ్లు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చిట్యాల సువిద్య డిగ్రీ కళాశాల లో చంద్రబోస్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీగేయ రచయిత బండి సత్యం మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప అవార్డు ఆస్కార్ అవార్డు తీసుకున్న వ్యక్తి మన చంద్రబోస్ అని మూడువేల పైచిలుకు సినిమా పాటలు రాశాడని సామాన్య కుటుంబంలో పుట్టి అంచేలంచేలుగా ఎదిగి ప్రపంచ సినిచరిత్రలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడని కొనియాడారు అదేవిధంగా చిట్యాల మండలంలో తన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఎందరో కవులు తన అడుగుజాడల్లో నడుస్తున్నారని పేర్కొన్నారు అదే విదంగా కేక్ కట్ చేశారు కవులకు, కళాకారులకు, క్రీడారంగం, వైద్య రంగం, సామాజిక సేవ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికీ శాలువాతో సన్మానం చేసి ప్రశంసా పత్రాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వర్ధమాన గేయ రచయితలు
దాసారపు నరేష్ , బానోతు రాజు నాయక్ , బుర్ల రత్నాకర్, గాయని గడ్డం రజిత , కళకారుల జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నే యుగేందర్ ఎంపీటీసీ దబ్బెట అనిల్ , శ్రీదేవి, సింధు, ప్రేమ్ కుమార్, బానోతు అలకనంద రాథోడ్ , సంగి సంజన, మాస్ రమేష్, గుర్రపు రాజమౌళి, బానోతు రాజకుమార్ మాజీ సైనికుడు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »