22న చలో జోగిపేట శక్తి ప్రదర్శనను జయప్రదం చేయండి

__బీఎస్పీ ఇన్చార్జ్ అందోల్ అసెంబ్లీ డా.ముప్పారంప్రకాశం

రాయికోడ్ మండలాన్ని అభివృద్ధి చేస్తాం బి.ఎస్.పి కి అవకాశం ఇవ్వండి

రాయికోడ్ మండల బిఎస్పి అధ్యక్షులుగా మాలేదొడ్డి ప్రవీణ్ కుమార్, ప్రధానకార్యదర్శిగా గట్టమీది వీరేశం గౌడ్ ల ఏకగ్రీవ ఎన్నిక.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురవుతుందని, అందులో రాయికోడ్ మండలానికి మరీ అన్యాయం చేశారని, స్థానికులమని చెప్పేసి అందోల్ అభివృద్ధిని అటకెక్కించ్చారని, రాయికోడ్ అభివృద్ధి కావాలంటే బిఎస్పీకి అవకాశం ఇవ్వాలని బిఎస్పి అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం అన్నాడు.

ఇప్పటిదాకా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి స్థానికేతర్లే శాసనసభ్యులు కావడం వల్ల ఇక్కడి ప్రజల కష్టసుఖాలు అర్థం కావట్లేదు అని, ఎన్నికలప్పుడే ప్రజాసంక్షేమం గురించి మాట్లాడుతూ పాపం గడుపుతున్నారని ఏ ఊరిలో ఏ అభివృద్ధికి అనిపించట్లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే శాసనసభ్యులు తమ బాధ్యత మరిచి కల్యాణ లక్ష్మి పెన్షన్లు దళిత బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టుకుని అటెండర్ డ్యూటీ చేస్తున్నారని, అధికారులు చేయాల్సిన పనిని ఎమ్మెల్యే చేయ్యడం ఆశస్పదమన్నారు. అందోల్ నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఎన్ని నిధులు తెచ్చింర్రు. ఎంత ఖర్చు పెట్టారో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.

నేడు రాయికోడ్ మండలం బిఎస్పీ కార్యకర్తల సమావేశం నిర్వహించి అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) రాయికోడ్ మండల కమిటీ అధ్యక్షులుగా మాలేదొడ్డి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మ్యాతరి శీను, ప్రధాన కార్యదర్శిగా గడ్డమీది వీరేశం గౌడ్, కార్యదర్శి రాజు, అనిల్ కుమార్, కోశాధికారి మైబత్ పూర్ ప్రసాద్, బివిఎఫ్ కన్వీనర్ గా మన్నేల్లి సీమోన్, కార్యవర్గ సభ్యులుగా ఏర్పుల రాములు, కొన్నింటి అనిల్, నర్సింలు, ప్రసాద్, ఏర్పుల రమేష్, మాలేదొడ్డి సందీప్
లతోపాటు 26 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అనంతరం ఈనెల 22న జోగిపేట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన బహుజన శక్తి ప్రదర్శన కూడా పత్రికను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో బిఎస్పి వట్టిపల్లి మండల అధ్యక్షులు పల్లె కిరణ్ కుమార్, నాయకులు అనిల్, మోహన్, సురేందర్ గౌడ్, భూమేష్, సుమన్, సాయికుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »