చల్ల వంశీచందర్ రెడ్డి గెలుపుకి కృషి చేయండి:

చల్ల వంశీచందర్ రెడ్డి గెలుపుకి కృషి చేయండి:
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9:
దామరగిద్ద మండలంలోని నరసాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింట ప్రచారాన్ని కొనసాగించారు.ఇప్పటికే అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ & అభివృద్ధి పథకాల తెలియజేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పేదల పార్టీ ప్రజల మధ్య నుండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే పేదవాడికి, గుండెచప్పుడే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందించే ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని పేదరికం, నిరుద్యోగం, ఆకలి బాధలు, లేని కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు తెలియపరిచారు. గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి మార్పులు చర్యలు జరగలేదని గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇల్లు ప్రతి కుటుంబానికి మళ్ళీ అందిస్తామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మీటింగ్లలో మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజల కష్టాలను,తెలుసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటూ పేదరికం లేని దేశంగా ప్రయాణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చల్ వంశీచందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో గ్రామ అధ్యక్షుడు డేవేంద్రప్ప ,జైపాల్ రెడ్డి, చిన్న నరస్పప్ప రవి, లాలు, పాల్గొన్నారు.