రాజేంద్రనగర్ లో టిడిపి శ్రేణుల సంబరాలు

జ్ఞాన తెలంగాణ
రాజేంద్రనగర్

ఆంధ్రప్రదేశ్ లో వెలువడిన ఫలితాలలో టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థులు సునామిని సృష్టించారని రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని టిడిపి శ్రేణులు అన్నారు. పూర్వం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో గుర్తు చేసుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగిందని అన్నారు. అందు నిమిత్తమే ప్రజలు ఆలోచన చేసి గట్టి గుణపాటమే చెప్పారు అని మంగళవారం నాడు వెలువడిన ఫలితాలు తెలియ జేస్తున్నాయని అన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.

You may also like...

Translate »