చేవేళ్లలో కొండా గెలుపుతో సంబరాలు

చేవేళ్లలో కొండా గెలుపుతో సంబరాలు
మహేశ్వరంలో భారీ మెజార్టీకి కృషి చేసిన
బీజేపీ ఇంచార్జి శ్రీరాములు యాదవ్
బడంగ్ పేట కార్పొరేషన్ లో బాణాసంచా కాల్చిన నేతలు
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం సృష్టించటంతో మహేశ్వరం నియోజకవర్గంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటుకున్నాయి.
బడంగ్ పేట కార్పొరేషన్ నాదర్ గుల్ కార్పొరేటర్, మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి బాణాసంచా కాల్చారు. ఈసందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి పాలనపై నమ్మకం లేదన్నారు. ఈ ఎన్నికలు రెఫరెండం అన్న రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న చేవేళ్ల పార్లమెంటులో బీజేపీ భారీ మేజార్టీతో దూసుకెళ్తుందన్నారు. రాజీనామా చేయకుంటే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అందెల శ్రీరాములు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి,అధికార ప్రతినిధి రాజశేఖర రెడ్డి, అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్లు నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, రాజమోనిరాజు, పున్న భిక్షపతి, మంత్రి మహేష్ ముదిరాజ్, తోట ప్రతాప్ రెడ్డి,అరవింద్ రెడ్డి, బీజేవైఎం నాయకులు రాఘవేందర్ అధ్యక్షులు ఆర్ రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జంగారెడ్డి, బాలాపూర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గుండె నాగార్జున బాబు, అరవింద్,కళ్లెం లక్ష్మారెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి,మల్లేష్, రవికాంత్ గౌడ్,పెద్దయ్య, అమరేందర్ రెడ్డి సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.