CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

https://cbse.gov.in

https://cbseresults.nic.in

CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

C BSE 12వ తరగతి ఫలితాలను 2024 మే 13న ఈరోజు విడుదల చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (CBSE). ఈ ఏడాది ఫలితాల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన 12వ తరగతి పరీక్ష నోటిఫికేషన్లో 1633730 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 1621224 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 1426420 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం కొంతమేర పెరిగింది. ఈ ఫలితాల్లో అబ్బయిలతో పోలిస్తే అమ్మాయిలదే పైచేయి కావడం విశేషం. 91.52 శాతంకు పైగా అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా.. 85.12 శాతంకు పైగా అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డ్ వెల్లడించింది.

అధికారిక వెబ్సైట్ ద్వారా సీబీఎస్ఈ ఫలితాలు చెక్ చేసుకోండిలా..

https://cbseresults.nic.in

You may also like...

Translate »