ప్రమాదకరమైన జిలిటన్ స్టిక్స్ పట్టివేత

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్

……రూ. 8 లక్షల 74వేల 950 విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం

……నలుగురిని అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు

…….కంప్రెషర్ ట్రాక్టర్, 4 స్మార్ట్ ఫోన్స్ తదితర సామాగ్రి సీజ్

……మీడియా సమావేశంలో షాద్ నగర్ “ఏసిపి రంగస్వామి” వెల్లడి

అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్ధాలు జిలిటన్ స్టిక్స్ ను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 8 లక్షల 74వేల 950 విలువైన పేలుడు పదార్థాలతో పాటు కంప్రెషర్ ట్రాక్టర్, 4 స్మార్ట్ ఫోన్స్ తదితర సామాగ్రిని సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. శనివారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) సీహెచ్ రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ.. కేసు వివరాలను వెల్లడించారు. ఫరూక్ నగర్ మండలంలోని కమ్మదనం గ్రామానికి చెందిన ఉరుసు నరసింహ (60), పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాల సమీపంలో నివసిస్తున్న ఈశ్వర్ (45), అదేవిధంగా పట్టణానికి చెందిన వురుసు రాజు తదితరులు 490 జిలిటన్ స్టిక్స్ ను నిబంధనలకు వ్యతిరేకంగా తమ వద్ద నిల్వ ఉంచుకున్నారు. వీటి విలువ రూ. 8 లక్షల 74వేల 950 ఉంటుందని ఎసిపి వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్, డిసిపిలు నారాయణరెడ్డి, డి.శ్రీనివాస్, శంషాబాద్ ఎస్ఓటి డిసిపి రాంకుమార్, అడిషనల్ డిసిపి శంషాబాద్ జోన్ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో వారి సూచన మేరకు షాద్ నగర్ ఏసిపి సిహెచ్ రంగస్వామి సారథ్యంలో షాద్ నగర్ సిఐ కే. ప్రతాప్ లింగం, శంషాబాద్ ఎస్ఓటి సిఐ సంజయ్ కుమార్ తదితరులు ఆధ్వర్యంలో పోలీసు బృందం చాకచక్యంగా వ్యవహరించి 490 జిలిటీన్ స్టిక్స్ తో పాటు
కంప్రెసర్ ట్రాక్టర్, నాలుగు స్మార్ట్ ఫోన్లు, ఒక వైర్ కట్టర్, ఒక ఎలక్ట్రిక్ టెస్టర్, సామాగ్రిని పట్టుకున్నట్టు ఏసిపి రంగస్వామి తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన జిలిటన్ స్టిక్స్ ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి లైసెన్స్ లేకుండా వీటిని నివాస గృహాల మధ్య ఉంచడం, ఎంతో నిషిద్ధమని పేర్కొన్నారు. ఇవి పేలితే ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని ఏసిపి పేర్కొన్నారు. కమ్మదనం గ్రామానికి చెందిన ఉరుసు నరసింహ, ఈశ్వర్, వురుసు రమేష్, బిల్డింగ్ బ్లాక్స్ కు చెందిన మధుసూదన్ రెడ్డి తదితరులు కలిసి వీటిని అక్రమంగా నిలువ ఉంచారని వారు పేర్కొన్నారు.

ఇలా దొరికారు..

బిల్డింగ్ బ్లాక్స్ కు చెందిన యజమాని మధుసూదన్ రెడ్డి ఇలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి లైసెన్స్ లేకుండా జిలేటెన్ స్టిక్స్ వాడకానికి వాటిని ఉపయోగించేందుకు తెచ్చారని ఎసిపి పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన సతీష్ వీటిని వారికి ఇచ్చేవాడని భువనగిరి ప్రాంతానికి చెందిన ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ ప్లోజీవ్ లిమిటెడ్ కంపెనీ నుండి వీటిని వారు తీసుకొస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. బిల్డింగ్ బ్లాక్స్ యజమాని మధుసూదన్ రెడ్డి వీటిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ బ్లాస్టింగ్ చేసేందుకు ప్రయత్నించారని ఇందులో భాగంగానే సమాచారం అందడంతో వాటిని శంషాబాద్, షాద్ నగర్ పోలీసులు కలిసి వీటిని పట్టుకున్నారని పేర్కొన్నారు. ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ ప్లోజీవ్ లిమిటెడ్ భువనగిరి ప్రాంతంలోని చిట్యాలకు చెందిన మేనేజర్ పి. నరేందర్ రెడ్డి అదేవిధంగా మధుసూదన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అదుపులో నరసింహ, ఈశ్వర్, రాజు, రమేష్ ఉన్నారని వారిని విచారిస్తున్నట్లు ఏసిపి రంగస్వామి తెలిపారు. పరారీలో ఉన్న వారిలో బిల్డింగ్ బ్లాక్స్ యజమాని మధుసూదన్ రెడ్డి కంపెనీ మేనేజర్ నరేందర్ రెడ్డి సతీష్ ఉన్నట్టు ఏసీపీ తెలిపారు.
షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 421/2024 ప్రకారం 4 అండ్ 5 ఆఫ్ ఎక్స్ ప్లోజీవ్ యాక్ట్ 1908 ఆఫ్ షాద్ నగర్ కింద కేసు బుక్ చేసినట్టు తెలిపారు. శంషాబాద్ ఎస్ఓటి సీఐ సంజయ్ కుమార్, స్థానిక సిఐ ప్రతాప్ లింగం తదితరులు చాకచక్యంగా కేసులొ వ్యవహరించినట్టు తెలిపారు. జిలిటన్ స్టిక్స్ పట్టివేతలో పాల్గొన్న పోలీసు సిబ్బంది ఎస్సైలు శ్రీకాంత్, తరుణ్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటరమణ, సోమ్లా నాయక్, ప్రభాకర్ రెడ్డి, కానిస్టేబుల్స్ సత్యనారాయణ, జాన్సన్, వంశీకృష్ణ, రాధాకృష్ణ, రవికుమార్, రాజశేఖర్, ఆంజనేయులు, విజయ నర్సింగ్ తదితరులను ఎసిపి రంగస్వామి అభినందించారు..

You may also like...

Translate »