విద్యా సంస్థలకు ఉన్న కులం పేర్లు తొలగించాలి

మద్రాసు హైకోర్టు ఆదేశం

విద్యా సంస్థలకు ఉన్న కులం పేర్లను తొలగించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దక్షిణ భారత సెంగుంట ముదలియార్‌ సంఘం నిర్వహించే విద్యా సంస్థలు, సంఘానికి సంబంధించిన కేసుపై న్యాయమూర్తి జస్టిస్‌ భరత చక్రవర్తి విచారణ జరిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు కులాలు లేవనే పాఠాన్ని బోధిస్తారని.. దీనికి భిన్నంగా ఆ విద్యా సంస్థల పేరులో మాత్రం కులం ఉందని, ఇదెలా న్యాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. సంఘాలకున్న కులం పేరును తొలగించాలంటూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కులం పేరుతో సంఘాలను నమోదు చేయకూడదని రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ సర్క్యులర్‌ పంపాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలకు కులం పేర్లు పెట్టారని, వాటిని తొలగించడంపై సంబంధిత విద్యాలయాలకు నోటీసులు పంపాలని సూచించారు. నిరాకరిస్తే విద్యాసంస్థల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయాలని అన్నారు. అక్కడి విద్యార్థులను గుర్తింపు పొందిన మరో విద్యాసంస్థల్లో చేర్చాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే వివిధ కులాల సంక్షేమ పాఠశాలల్లోనూ కులం పేరు తొలగించాలన్నారు.

You may also like...

Translate »