తాళం వేసిన ఇంట్లో చోరీ.

తాళం వేసిన ఇంట్లో చోరీ.
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ మున్సిపల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి దొంగలు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి తులంన్నర బంగారం, 15 వేల నగదు దొంగిలించినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి మేడపైన నిద్రించినట్లు బాధితుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ క్రమంలో దొంగలు బుధవారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో వస్తువులు చిందరవందర చేసి బంగారం, 15 వేల రూపాయలు నగదు దోచుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.