పిడుగుపాటుకు గేదె మృతి .


బోధన్ మండలంలో ఈదురు గాలులతో కురిసిన వర్షం.
ఫోటో. పిడుగుపాటుకు మృతి చెందిన గేదె .
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో గురువారం ఈదురు గాలులతో కురిసిన వర్షంతో పిడుగు పడి గ్రామానికి చెందిన ధాత్రిక రమేష్ అనే నిరుపేద పాడి రైతుకు చెందిన గేదె మేతకు వెళ్లి మృతి చెందింది. దాంతో రైతు విలపించాడు .తన కుటుంబానికి జీవనాధారమైన గేదె పిడుగుపాటుతో మృతి చెందడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రోధించారు. రోజు గేదె పాలు విక్రయించి, కూలి పని చేస్తూ బతుకుతున్న కుటుంబానికి ప్రధాన జీవనాధారమైన గేదె మృతి చెందడంతో ఆయన రోదించారు. అధికారులు తన ఆదుకోవాలని వేడుకున్నారు.

You may also like...

Translate »