బుద్దె రాజేశ్వర్ కుటుంబానికి పరామర్శ.

బుద్దె రాజేశ్వర్ కుటుంబానికి పరామర్శ.

జ్ఞాన తెలంగాణ -బోధన్
సాలూర మండల కేంద్రానికి చెందిన బోధన్ ఎంపిపి బుద్దె సావిత్రి భర్త సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందగా గురువారం రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్బగోని లక్ష్మి నర్సయ్య గౌడ్ వారి నివాసానికి వెళ్లి బుద్దె రాజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.రాజేశ్వర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా లక్ష్మి నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాజేశ్వర్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకున్న మంచి నాయకుడన్నారు. తుది శ్వాస వరకు ప్రజా సేవలో,గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు.రాజేశ్వర్ మరణం ఆయన కుటుంబానికే గాక గ్రామానికి తీరని లోటని తెలిపారు.ఆయన వెంట సలీం బేగ్,ఫతేపూర్ మాజీ సర్పంచ్ అమీర్, బొర్ర గంగారాం ,కుటుంబ సభ్యులు ఉన్నారు.

You may also like...

Translate »