బీఎస్పీ పార్టీకి రాజీనామా.


జ్ఞాన తెలంగాణ- బోధన్
బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిగా వివిధ హోదాలలో పనిచేసిన బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామానికి చెందిన హుప్రియాల రామచందర్ బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్పీ పార్టీలో బివిఎఫ్ కన్వీనర్ గా, నియోజకవర్గ అధ్యక్షునిగా, సోషల్ మీడియా కన్వీనర్ గా, జిల్లా ఈసీ మెంబర్ గా నియమించి తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన వ్యక్తిగత కారణాలతో బీఎస్పీకి రాజీనామా చేస్తున్నానని, తాను ఎక్కడ ఉన్నా బహుజన గొంతుగగా ఉంటానని ఆయన పేర్కోన్నారు.

You may also like...

Translate »