దేశ తలరాతను మార్చేలా ఉన్న బిఎస్పీ మేనిఫెస్టో

దేశ తలరాతను మార్చేలా ఉన్న బిఎస్పీ మేనిఫెస్టో
నిరుద్యోగులకు, విద్యకు అసలు ప్రాధాన్యత ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో
అలంపూర్: తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఈ దేశ తలరాతను మార్చేలా ఉందని బిఎస్పీ నాయకులు మహేష్ గారు అన్నారు.
బీఎస్పీ మేనిఫెస్టో
నిరుద్యోగులకు, విద్యకు అసలు ప్రాధాన్యత ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో
- కాన్సి యువ సర్కార్
- పూలే విద్యా దీవెన
- బహుజన రైతు ధీమా
- చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
- భీమ్ రక్షా కేంద్రాలు
- బ్లూ జాబ్ కార్డ్
- నూరేళ్ల ఆరోగ్య ధీమా
- వలస కార్మికుల సంక్షేమ నిధి
- షేక్ బదంగి గృహ భరోసా
- దొడ్డి కొమురయ్య భూమి హక్కు
బీఎస్పీ మేనిఫెస్టో చదివిన ఎవరైనా కూడా కచ్చితంగా అభినందిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పోరాడుతారని ఆయన తెలియజేశారు.
అదే బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసినట్లయితే విద్యకి,ఉచిత వైద్యానికి, నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉపయోగం లేని మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు.
ఎంతో మేధావి చదువుకున్న విద్యావేత్త ఈ తెలంగాణకి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి పథకాలు ఖచ్చితంగా నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన దిశగా నడిపిస్తారని ఆయన తెలియజేశారు. అలంపూర్ ప్రజలారా ఇలాంటి నాయకున్ని ఎన్నుకొని మన అలంపూర్ తలరాతను ఈ రాష్ట్ర తలరాతను మార్చే దిశగా పయనిద్దామని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అలంపూర్ మండల అధ్యక్షులు సురేష్, మండల కన్వీనర్ నాగరాజు, మద్దిలేటి,అనిల్, ముప్పారపు, శరత్,రవి తదితరులు పాల్గొన్నారు.
