బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా యెర్రా కామేష్

మే 13న తెలంగాణ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ప్రకటించారు.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి నుండి అధికారికంగా అనుమతులు పొందారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పర్యటించి బీఎస్పీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ముందుకు సాగుతానని అన్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికలు తొంబై శాతానికి పైగా ఉన్న బహుజనులకు,అగ్రవర్ణాలకు మధ్య పోటీగా అభివర్ణించారు.ప్రజల గుండెల్లో బహుజన వాదం బలంగా ఉందని దాన్ని ఓట్ల రూపంలో మరల్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

You may also like...

Translate »