సామినేని రామారావు దారుణ హత్య

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా,అక్టోబర్ 31:

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం గ్రామానికి వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

సామినేని రామారావు సీపీఎం పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు. పలు ఉద్యమాల్లో పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటుగా పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లాలో రాజకీయ వర్గాలు, ప్రజా సంఘాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి. ఖమ్మం నగరంలో సీపీఎం కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. రామారావు హత్యకు కారణాలు వెలుగులోకి తేలాలంటూ విస్తృత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

You may also like...

Translate »