డా.సుధీర్ కుమార్ గెలుపుకోసం విస్తృత ప్రచారం:

డా.సుధీర్ కుమార్ గెలుపుకోసం విస్తృత ప్రచారం:


కొత్వాల్.కుమార్ బిఆర్ఎస్ నాయకుడు

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్ టౌన్:


ఈ రోజు జఫర్ గఢ్ మండల కేంద్రంలోని 5,వార్డు,6,వార్డు,7,8 వార్డు లలో బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ దేవస్థాన కమిటీ ఛైర్మన్ కొత్వాల్. కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి. డాక్టర్. మారపెళ్లి.సుధీర్ కుమార్ గారి గెలుపు కోరుతూ ప్రతి ఓటర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు గ్యారంటీ లు అడ్రెస్ లేకుండా పోయాయి అని,రైతుల నోట్లో మట్టి కొట్టారని,ఆడ పడుచు పెళ్లికి తులం బంగారం తుంగలో తొక్కి పెట్టారని కావున ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని మళ్ళీ కెసిఆర్ నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కారు గుర్తు పై ఓటు వేసి బీఆర్ ఎస్ అభ్యర్థి ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి కి వెళ్ళి ఓటర్ల ను కోరారు. ఈ కార్యక్రమంలో కో.ఆప్షన్ నెంబర్ ఎం.డి.నజీర్,అన్నేబోయిన.సంపత్,అన్నేబోయిన. శ్యామ్, మాడరాజు. సంతోష్,అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »