భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపించాలని…

భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపించాలని

భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపించాలని…ఇంటింటి ప్రచారం
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 6
కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపిస్తాయని ఇన్చార్జి బిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, భీమగాని మత్స్యగిరి సువర్ణ, చంద్రయ్య, చీరిక జనార్దన్ రెడ్డి, నల్లబోలు మొగులయ్య, మారోజు యాదగిరి, గుంటోజు నర్సింహా చారి, పోలేపాక సత్యనారాయణ, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »