మక్త గూడా పిల్లోని గూడా వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

నత్త నడకన పనులు జరుగుతుండడంతో వాహనదారుల అవస్థలు.

బ్రిడ్జి పనులు పూర్తి చేసి వినియోగం లోకి తేవాలి

పిల్లోని గూడా గ్రామ స్థానికుడు జుర్కి రమేష్ పటేల్.

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) మక్తగూడ పిల్లోనిగూడ మధ్యన జరుగుతున్న బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహనదారులు బాటసారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాదిమంది వాహనదారులు బాటసారులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో పనులు మందకొడిగా సాగుతూ ఉండడంతో దుమ్ము దూళితో కంకర తేలి వాహనాలు నడపలేని స్థితిలో ఉన్నారని గ్రామస్థానికుడు జుర్కీ రమేష్ పటేల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పిల్లోని కూడా మక్తగూడ మధ్యన చెరువు కట్ట తెగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అప్పట్లో మక్త గూడా పిల్లోని గూడా పాలమాకుల గ్రామ ప్రజలు వర్షాలు పడిన ప్రతిసారి కట్టలు తెగిపోవడం విరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం పెద్ద సమస్యగా ఉండేది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మక్తా గూడా పిల్లోని గూడా గ్రామాల మధ్య ఉన్న చెరువు కట్ట సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడంతో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మార్చిలు ఎర్రబెల్లి దయాకర్ రావు విన్నవించడంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా అప్పట్లో బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగింది. గత రెండేళ్లుగా బిజీ నిర్మాణ పనులు అరకొరక సాగుతున్నాయి అని ముఖ్యంగా కొంతమేర పూర్తయినప్పటికీ హీరో గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడం ఈ బ్రిడ్జి వద్ద కంకర కుప్పలు ఇసుక తేలి ఉండడం గతంలో వాహనదారులు ప్రమాదాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయని దుమ్ము ధూళితో వాహనదారులు అవస్థలు పడుతున్నారని వారు అన్నారు. ఏళ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో ఈ మార్గాల గుండా నిత్యం వెళ్లే వాహనదారుడు బాటసారులు బ్రిడ్జి వద్ద అస్తవ్యస్తంగా కంకర తేలి దుమ్ము దులితో కొట్టుమిట్టాడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని త్వరగా పనులు పూర్తి చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని కోరుతున్నారని ఆయన అన్నారు. వాహనాలు వెళ్లే సమయంలో వచ్చే దుమ్ముదులితో వెనుక వస్తున్న వాహనాలు ఉన్నాయో లేవో ఏ విధంగా వెళుతున్నమో అర్థం కావడం లేదని ఆందోళన పడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళనైనా కనీసం ఈ మట్టి రోడ్డుపై నీళ్లు చల్లితే దుమ్ము లేవకుండా ఉంటుందని కోరుతున్నామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేస్తే సమస్యలు తొలగిపోతాయని రమేష్ తెలిపారు.

You may also like...

Translate »