బాలుర గురుకుల పాఠశాలను కల్పించాలి:

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14:

నారాయణపేట లో కొనసాగుతున్న బాలుర గురుకుల పాఠశాల దామరగిద్ద మండలంలోని కొనసాగించాలని ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ దామరగిద్ద మండలంలో సొంత భవనం లేక నారాయణపేటలో కొనసాగుతున్న బాలుర గురుకుల పాఠశాల ను తక్షణమే దామరగిద్ద మండలంలో నిర్వహించాలని కోరారు. అక్కడ విద్యార్థులు ఒకే దగ్గర చదువు తినడం పండుకోవడం జరుగుతుంది అలాగే బాత్రూములకు నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉన్నది పిల్లలు అంతా ఒకే దగ్గర ఉండడం వల్ల వారికి చర్మ రోగాలు వస్తున్నాయి దీనివల్ల తల్లిదండ్రులు హాస్టల్ కు పంపిలన్నా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కావున దయచేసి వెంటనే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దామరగిద్ద మండలంలో నూతన భవనం నిర్మించి హాస్టల్లో వసతి కొనసాగించాలని కోరడం జరిగింది. ఇట్టి విషయమై ఎమ్మెల్యే గారు స్పందిస్తూ తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆనంద్, మహేష్, అశోక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »