కాంగ్రెస్ పార్టీలో చేరిన బోధన్ ఎంపీపీ.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బోధన్ ఎంపీపీ.


ఫోటో.పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్లే సుదర్శన్ రెడ్డి.
బోధన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి-రాజేశ్వర్ దంపతులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఎంపీపీ బుద్దె సావిత్రి దంపతులను పార్టీలో ఆహ్వానించారు. ఎంపీపీతో పాటు భవానిపేట్ మాజీ సర్పంచ్ పల్లెంపాటి కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ లో చేరారు. ఈ సంధర్బంగ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని సూచించారు.

అనంతరం ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాదు జిల్లా ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేస్తామని ఎంపీపీ బుద్దె.సావిత్రి రాజేశ్వర్ తెలిపారు..బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతుల సంక్షేమం కొరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం కొరకు కృషి చేస్తున్నందుకు దానికి ఆకర్షతులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు.

వారివెంట సాలూర గ్రామ నాయకులు స్వామిగౌడ్, ఎంపీటీసీ సవిత, బొర్ర గంగారాం, శివకాంత్ పటేల్, రాజేశ్వర్,నరేందర్ రెడ్డి, సంగెం మాగిరి పోశెట్టితో పాటు సుమారు వంద మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తహర్ బిన్ హందన్, గంగా శంకర్, మందార్నా.రవి, డి.నాగేశ్వర్ రావు, గణపతి రెడ్డి, నరేందర్ రెడ్డి, బోధన పాటి కృష్ణ ఇళ్తేపు. రమేష్, కేజీ గంగారాం పాల్గొన్నారు.

You may also like...

Translate »