భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి”

బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గానికి చెందిన బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎంపికయ్యారు. శుక్రవారం బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన ఉత్తర్వులో ఆయన వెల్లడించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని ఉత్తర్వులో వెల్లడించారు. బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని, సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని, మీ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి అన్ని వర్గాలలో మరింత విస్తరించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను పండు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి కిషన్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి వెలువరించిన నియామక ఉత్తర్వులో పేర్కొన్నారు.. కేపీ

You may also like...

Translate »