మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన బిజెపి నాయకులు

జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అంకుశపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త మారేపల్లి మొండయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ సోషల్ మీడియా కన్వీనర్ దుగ్యాల రామచంద్ర రావు ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గుర్రం నాగరాజు ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతుని కుటుంబ సభ్యులు ఎవరు అధైర్య పడవద్దని భరోసా కల్పించారు మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా గుర్రపు నాగరాజు సోషల్ మీడియా మండల ఇన్చార్జి చిలుక మహేందర్ బూతు అధ్యక్షులు చిలుక రమేష్, మంద వెంకటేష్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు దానవేణి చిన్న కుమార్, చిలుక ప్రణీత్, అబ్బేంగుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »