ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం
ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్ బాబు.
జ్ఞాన తెలంగాణ – బోధన్

ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని రాకసిపేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందినాయని అన్నారు. కానీ తిరిగి మూడవసారిగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బిజెపి ఎన్ డి అధికారంలోకి రావాలని కలలుగంటున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కలలు దేశంలో నిజమయ్యే పరిస్థితి లేదని, కచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తాము భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు.
ప్రధానంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలకు ఇస్తామని ఇప్పటికి ఇవ్వలేదని అన్నారు. ఉన్న ఉద్యోగాలే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను ప్రయివేటికరణచేసి ఉద్యోగాలని తొలగించి పెట్టుబడుదారులకు దోచిపెట్టడం జరిగిందని అన్నారు. దేశంలో ఇండ్లు లేని పేద ప్రజలందరికీ 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు .కానీ నేటికీ కోట్లాదిమందికి ఇంటి స్థలం గాని ఇండ్లు గాని లేని పరిస్థితి ఉందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కూడా ప్రైవేటీకరణ చేసి ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్మును పెట్టుబడుదారులకు అంబానీ, ఆదానిలకు దోచిపెట్టడం జరిగిందని పేర్కోన్నారు. దేశంలో ఉన్న పెట్టుబడుదారులు, నల్ల డబ్బును విదేశాలలో దాచి పెట్టుకుంటే వాటిని ఇండియాకు తీసుకువచ్చి ప్రతి పేదవారికి బ్యాంక్ అకౌంట్ తీసి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని, ఇప్పటికీ అది అమలు చేయలేదని విమర్శించారు.
బిజెపి ప్రభుత్వం ఒకవైపు కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద తిరిగి 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందుకని దేశంలో ఉన్న నిరుద్యోగులు, యువత, రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలు తమ అమూల్యమైన ఓటును బిజెపికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలకు ఓటు వేసి ఇండియా కూటమి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) పార్టీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ఏరియా కమిటీ కార్యదర్శి ఏషాల గంగాధర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కార్యదర్శివర్గా కమిటీ సభ్యులు జమ్మిశెట్టి శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ఏరియా కమిటీ సభ్యులు జంగం గంగాధర్ పాల్గొన్నారు.
.