రుతుపవనాలు వచ్చేశాయి, కానీ – వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!

రుతువపనాల ఆగమనం మొదలైంది. నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయి. నిర్దేశిత సమయం కంటే వేగంగా కదులుతున్నాయి. ఇంకా వేసవి పూర్తి కాకముందే రుతుపవనాల కదలికతో ఉపశమనం కలగనుంది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తొలు త ఈశాన్యంగా పయనించి 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

అండమాన్ కు రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకినట్లు అధికారులు నిర్దారించారు. అంచనాలకు తగినట్లుగానే రుతుపవనాల్లో కదలిక కనిపిస్తోందని వెల్లడించారు. జూన్ 1న కేరళను తాకుతాయని స్కైమెట్‌ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్స్ ఇచ్చింది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భూ ఉపరితలం నుంచి అల్పపీడనం/వాయుగుండం వైపు పొడిగాలు లు వీస్తాయని, ఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఈనెల 23 నుంచి ఎండ తీవ్రత పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

22న అల్పపీడనం కోస్తాలో 25వ తేదీ వరకు వేడి వాతావరణం ఉంటుందన్నారు. దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే క్రమంలో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఈనెల 31కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, జూన్‌ ఒకటినే కేరళను రుతుపవనాలు nii తాకుతాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ తెలిపింది.

You may also like...

Translate »