గురుకుల విద్యార్థుల మృతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలి

గురుకుల విద్యార్థుల మృతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలి

 బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్  

జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 19

భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై విచారణ జరిపించాలని SC ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ను సెక్రటేరియట్లో కలిసి వినతిపత్రం ఇచ్చిన SC,ST,BC హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, 1సంవత్సరం క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి,

బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా sc సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల ప్రాణాలంటే ఈ అధికారులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది .

జరిగిన ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో tssA అధ్యక్షులు కూరెళ్ళ మహేష్, MRPS నాయకులు చిట్టిపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »