మందు పాతర పేలి గాయాలై హాస్పటల్లో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

మందు పాతర పేలి గాయాలై హాస్పటల్లో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
జ్ఞాన తెలంగాణ/ భద్రాచలం. జూన్ 14:
మందుపాతర పేలి గాయాలై హాస్పటల్లో చికిత్స పొందుతున్న మహిళను భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పరామర్శించారు. భద్రాచలంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డర్రా సునీతను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా సహయ సహకారాలు అందే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.