ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ ఏజెంట్ గా భద్రాచలం మాజీ శాసనసభ్యులు

జ్ఞాన తెలంగాణ/ భద్రాద్రి/ దుమ్ముగూడెం న్యూస్. మే 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం పోలింగ్ బూత్ ఏజెంట్ గా అవతారం ఎత్తారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో దుమ్ముగూడెం మండలం, దుమ్మగూడెం గ్రామం 229 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ లో పొదెం వీరయ్య కాంగ్రెస్ తరపున బూత్ ఏజెంట్ గా బాధ్యతలు చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా, ఏఐసీసీ స్థాయిలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన పొదెం బూత్ ఏజెంట్ గా బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన సమయంలో ఇదే మండలం నుంచి పొదెంకు కాస్త తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో దుమ్ముగూడెం మండలం పై పూర్తిస్థాయిలో పార్టీపై ఏకాగ్రత నిలుపుతూ వస్తున్న పొదెం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపటానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూతు ఏజెంట్ గా బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుకు ఆది నుంచి పొదెం కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేశారు.

You may also like...

Translate »