చిన్న గొడవ కాస్త తీవ్ర స్థాయికి చేరి హత్య యత్నానికి దారి తీసింది.

చిన్న గొడవ కాస్త తీవ్ర స్థాయికి చేరి హత్య యత్నానికి దారి తీసింది.
…. బైక్ అడ్డు తియ్యాలన్నందుకే గొడవ
……సహనం కోల్పోయిన యువకులు
……24 గంటలు ఎయిర్‌పోర్ట్ బావర్చి తెరిచి ఉండడం వల్ల నిత్యం గొడవలు
జ్ఞాన తెలంగాణ
శంషాబాద్
బైకు అడ్డం తీయమన్నందుకు ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్పోర్ట్ బావర్చి హోటల్ ముందు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ బావార్చి వద్ద యాక్టివ బైకుపై ముగ్గురు యువకులు బండి నిలిపారు. అటుగా వచ్చిన మరో యువకుడు బైక్ అడ్డం తీయాలని చెప్పడంతో వీరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో యాక్టివా పై ఉన్న ఇద్దరు యువకులు సురేష్, నాయక్ పై కత్తితో దాడి చేయటంతో సురేష్‌కు తీవ్ర గాయాలు కాగా నాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకొని దాడికి పాల్పడిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ బావార్చి 24 గంటల పాటు తెరిచే ఉండడంతో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారిపై ఇష్టం వచ్చినట్లు వాహనాలు పార్కింగ్ చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పోలీసులు ఎయిర్పోర్ట్ బావార్చి నిర్వాహకులపై చర్యలు తీసుకొని రోడ్డుపై వాహనాలు నిలపకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఎయిర్‌పోర్ట్ బావార్చి వద్ద జరిగిన దాడి ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ దాడిలో గాయపడ్డ సురేష్, నాయక్ లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎవరు ఎలాంటి భయాందోళన గురి కావద్దని . శంషాబాద్ RGIA పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలియజేసారు.