తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం బహుజన విద్యార్థి గర్జన

రేపు సంగారెడ్డి పట్టణ కేంద్రంలో  స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
బహుజన విద్యార్థి గర్జన కు స్వేరోస్ ఫౌండర్ డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిగా వొస్తున్నారని ఈ సభకు వేలాది గా విద్యార్ధి, విద్యార్థినిలు హాజరై కార్యమాన్ని విజయవంతం చేయాలనీ కార్యక్రమం నిర్వాహకులు స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు రాజ్ కుమార్ తెలిపారు.
వారు మాట్లాడుతూ..
బహుజన బిడ్డలారా, పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యావ్యవస్థ పూర్తిగా విఫలమయ్యింది. ఉద్యమకాలంలో కేసియార్ ఇచ్చిన కేజీ టూ పీజీ హామీ నినాదం పత్తాకు లేదు. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగానికి వార్షిక బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ సిఫారసు చేసింది. కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో 2014-2015 మొదటి వార్షిక బడ్జెట్లో 10.89శాతం నిధుల కేటాయిస్తే 2023-2024 ప్రస్తుత వార్షిక బడ్జెట్లో 6.57 శాతానికి కుదించి విద్యావ్యవస్థపై సర్కార్ తన నిర్లక్ష్య ధోరణిని చాటుకుంది. ఇక మృత్యు నిలయాలుగా వసతి గృహాలు, సమస్యల నిలయాలుగా సర్కారీ బడులు కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాయి.

తెలంగాణలో 40,901 పాఠశాలలు ఉండగా, వీటిలో 26,065 ప్రభుత్వ లోకల్ బాడీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 24 లక్షల మంది పేద, బీద విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో 15000 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, 6392 ఏకోపాధ్యాయ పాఠశాలలు నామమాత్రంగా నడుస్తున్నాయి. క్రమంగా ఉన్నత విద్యా పతనమైపోతోంది. ఇక తెలంగాణలో ఉన్న 11 యూనివర్సిటీల్లో 80శాతం అధ్యాపక సిబ్బంది. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 692 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 99 ప్రొఫెసర్ పోస్టులు. 270 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం కలిపి 1061 బోధనా ఖాళీలు ఉండగా మరో 1500ల బోధనేతర ఖాళీలు ఉన్నాయి.

వీటిలో కాంట్రాక్ట్ పార్ట్ టైమ్ సిబ్బందితో యేండ్లకేండ్లు నెట్టుకువస్తోంది ప్రభుత్వం. దీంతో ఇటీవల విడుదలైన జాతీయ యూనివర్సిటీ ర్యాంకుల్లో నాణ్యత ప్రమాణాలు లేని కారణంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల స్థానాలు దారుణంగా పడిపోయాయి. పైగా విశ్వవిద్యాలయాల్లో పెంచిన ఫీజులు బడుగు, బలహీన • వర్గాల విద్యార్థులకు పెను భారంగా పరిణమించింది.

డాక్టర్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు సెక్రటరీగా ఉన్నకాలంలో దళిత, గిరిజన సంక్షేమ హాస్టల్లలో విద్యార్థుల విజయాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి పోటీ పరీక్షల్లో సైతం హాస్టల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ఆనాడు హాస్టళ్లు నిలబడ్డాయి. ఇవాళ మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. విష ఆహారం వికటించి విద్యార్థులు వదే పదే దవాఖానాల పాలవుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వంటి చోట విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలై రోడ్డెక్కారు. ఇక ప్రతీరోజు గురుకులాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతున్నారు.

ఇక మరోవైపు ఉస్మానియా వంటి స్టేట్ యూనివర్సిటీలల్లో పెంచిన ఫీజులు విద్యార్థుల మీద పెనుభారంగా మారాయి. దీంతో క్రమంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితిని పాలకులే ఉద్దేశ్యపూరితంగా కల్పిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించి కన్నవాళ్లకు బుక్కెడు మెతుకులు పెట్టాలనుకునే 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను సైతం పేపర్ లీకేజీ కుంభకోణంతో కల్లలు చేశారు. నేటికి టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగానే లేదు. ఇట్లా విద్యావ్యవస్థ తెలంగాణలో పాలకుల నిర్లక్ష్యం వల్ల కూనరిల్లిపోతున్నది.

విద్యావ్యవస్థను పరిరక్షించి పేద, మధ్యతరగతి బిడ్డలైన బహుజనులకు నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ. రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో అలుపెరుగకుండా పోరాడుతోంది. ఈ పోరాటంలో విద్యార్థులు బహుజన రాజ్యాధికారం కోసం కంకణ బద్ధులై, పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క బహుజన విద్యార్థి గర్జన కి, విద్యార్థులు, మేధావులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరూ వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమం లో కార్యక్రమం నిర్వాహకులు స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మొగిలిపాక నవీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకట్, రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు రాజ్ కుమార్,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రకాష్, మెదక్ జిల్లా నాయకులు మధు మొ” వారు పాల్గొన్నారు.

You may also like...

Translate »