బహుజన సమాజ్ పార్టీకి రాం రాం..!

బీజేపీలోకి బీఎస్పీ యువ నేత “పసుపుల ప్రశాంత్ ముదిరాజ్”

బిజెపి అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్న ప్రశాంత్

డీకే అరుణమ్మ గెలుపు బాధ్యతను మేం తీసుకుంటామన్న ప్రశాంత్

బీఎస్పీ నాయకత్వ లోపంతో పార్టీ వీడా – పసుపుల ప్రశాంత్ వెల్లడి

బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి లో నాయకత్వం లోపం స్పష్టంగా ఉంది ఆ పార్టీలో రాజకీయంగా యువత మనుగడ సాగించలేదని అందుకే దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు బీఎస్పీకి రాజీనామా చేయడం జరిగిందని డీఎస్పీ నేత పసుపుల ప్రశాంత్ సంచల వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్ నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో ప్రశాంత్ తో పాటు పలువురు బిఎస్పి యువ నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య సమక్షంలో బీజేపీలో పసుపుల ప్రశాంత్ ముదిరాజ్, చింతల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ కొలుమాల రామకృష్ణ, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొలుముల శివకుమార్, శ్రీనివాస్ ఎక్స్ డిప్యూటీ సర్పంచ్, రాజేష్ నాయక్ బిఎస్పీ కొందుర్గ్ మండలం ఇంచార్జ్, మల్లేష్ గౌడ్ మండల జనరల్ సెక్రటరీ, శివ గ్రామ కమిటీ అధ్యక్షులు పసుపుల నర్సింలు, చెక్కల నర్సింలు,పి రవి,మధు,తేజ, గోపాల్, మారుతి, యాదోజీ, యాదగిరి తదితరులు మహబూబ్ నగర్ లోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో బీజేపీ చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చెన్నయ్య, యాదయ్య నర్సింలు ,నవీన్ రవి కే.చెన్నయ్య ,మారుతి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీకే అరుణ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం యువత నడుం బిగించాలని ఎంతోమంది యువత పార్టీ పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుండి బిజెపికి రావడం శుభసూచకమని ఆమె అన్నారు.

దేశ రక్షణ బిజెపితోనే సాధ్యం

దేశ రక్షణ బిజెపితోనే సాధ్యపడుతుందని బిజెపి పార్టీలో నూతనంగా చేరిన యువనేత పసుపుల ప్రశాంత్ మీడియాతో అన్నారు. దేశంలో ఉగ్రవాదం, హింస, అనేక దుశ్చర్యలను నివారించాలంటే దానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే సరైనదని నమ్మి ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. బహుజన సమాజ్ పార్టీలో ఎంతో కష్టపడి పని చేశామని అయితే ఆ పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా ఉందని అన్నారు. తను గత అసెంబ్లి ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీకే అరుణ గెలుపు కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రశాంత్ ధీమా వ్యక్తం చేశారు.. కేపీ

You may also like...

Translate »