రేపు సిద్దిపేటలో బహుజన దండయాత్ర, ముఖ్య అతిధిగా BSP పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.

రేపు బహుజన్ సమాజ పార్టీ సిద్ధిపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహుజన దండయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధిగా
బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రానున్నారని సిద్ధిపేట బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ గారు తెలిపారు.
ఉదయం 10:00 గంటలకు వెలది మందితో సిద్దిపేట లోని ముస్తాబాద్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ ప్రారంభం అవుతుందని,ఈ ర్యాలీలో వెలది మంది కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భారీ ర్యాలీ ముస్తాబాద్ చౌరస్తా నుండి శివమ్స్ ఫంక్షన్ హాల్ వరకు ఉంటుందని అనంతరం బహుజన దండయాత్ర కార్యక్రమం ప్రారంభం అవుతుందని అక్కడ సిద్ధిపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ రివ్యూ మరియు పార్టీ జాయినింగ్స్ ఉంటాయని అన్నారు.

7 సంవత్సరాల పదవిని త్యాగం చేసి పేదల బ్రతులులు మార్చడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలుగా బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తూ,లక్షలాది పేద బిడ్డల గుండెకోత విని,చాల రోజుల తరువాత సిద్ధిపేట పట్టణానికి వస్తున్నా డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షలో దాదాపు 1500 మంది వివిధ గ్రామాలకు చెందిన SC,ST,BC మైనారిటీ లు పార్టీలో చేరబోతున్నట్టు తెలిపారు.
బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనదైన వ్యూహం తో అధికార ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుట్టిస్తున్న డా” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిద్ధిపేట పట్టణానికి రావడం బహుజన వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి ఆత్మగౌరవం కాంక్షను రగిలించనుందని అన్నారు.
కావునా బహుజ సమాజ్ పార్టీ కార్యకర్తలు,డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులు ఈ కార్య్రక్రమంలో వేలాదిగా పాల్గొనవలసిందిగా బహుజన్ సామాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ గారు తెలిపారు.