భూమి పుత్రుడు రైతు..

భూమి పుత్రుడు రైతు..

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది.

రైతే దేశానికి వెన్నెముక భారతదేశ పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. పూర్వం గ్రామాల కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం భారతదేశ వ్యవసాయక దేశం ఇప్పటికీ 70శాతం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే రైతులు దేశానికి వెన్నెముక అన్నారు. ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు, వ్యవసాయంపై ఆధారపడ్డ దేశాలకు పల్లెలే పట్టుకొమ్మలు. చక్కటి పాడిపంటలతో అలారారే పల్లెలు ప్రకృతికి ప్రతిరూపాలు. రైతు విద్యావంతుడు కానప్పటికీ సంస్కారవంతుడు, తాను తనతో పాటు అందరూ అనే భావంతో జీవిస్తాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న తోటి వారి కష్టాల్లో పాలుపంచుకోవడానికి ముందుంటాడు. తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి వీలు లేకపోయినా ముఖంలో దిగులు కనబడనీయడు. “హలం అంటే నాగలి” నాగలితో భూమిని సాగు చేసి, జీవనం సాగించే రైతే హాలికుడు. సాత్విక భావాలతో “బ్రతుకు బ్రతికించు” అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు రైతు. పాడి పంటలతో నేల తల్లికి పశువులకు ప్రకృతికి సేవలు చేస్తూ ఆశావాద దృక్పథంతో జీవిస్తాడు.

రైతులు మనకు అన్నదాతలు ఎండకు ఎండి వానకు తడిసి చలికి వనికిన ధైర్యంతో కష్టపడి రైతు పంటలు పండిస్తాడు. రాత్రి బవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించే రైతు కష్టాన్ని చూసే “జై జవాన్ జై కిసాన్” అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి ఇటువంటి రైతే లేకపోతే మన జీవితాలే ఊహించలేం. అందుకే రైతే దేశానికి వెన్నెముక అన్న సత్యాన్ని మరవకూడదు. జాతీయ రైతు దినోత్సవం చౌదరి చరణ్ సింగ్. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం. రైతు కష్టమే ఫలితమే దేశ సౌభాగ్యం, రైతులకు అండగా నిలుద్దాం రైతన్నలను గౌరవిద్దాం రైతులకు విలువనిద్దాం.

రచన: దేవులపల్లి రమేశ్,
సిద్దిపేట జిల్లా నంగునూర్,

You may also like...

Translate »