ఘనంగా కందవాడలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ

కనుల పండుగ గా అయ్యప్ప మహా పడిపూజ
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 3
చేవెళ్ల మండల కంద వాడ గ్రామంలో అయ్యప్ప స్వామి సన్నిధానం ప్రాంగణంలో శుక్రవారం మాజీ ఎంపిటిసి కావలి లక్ష్మి రవీందర్ యాదవ్, కురువ మల్లేష్, ఆధ్వర్యంలో గురు స్వాములు ఉమా శంకర్ రెడ్డి, కే.పాండు యాదవ్ సమక్షంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.
వారు మాట్లాడుతూ…అయ్యప్ప స్వాములు మండలం రోజులు దీక్షలో నియమనిష్ఠలతో ఉండి అయ్యప్ప స్వామిని పూజిస్తారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె కోరారు..
వందలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప నామ స్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.
అయ్యప్ప స్వాములు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.18 పడి మెట్లకు పూజలు చేశారు. అనంతరం, స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలోనీ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అధ్యక్షులు పెద్దల ప్రభాకర్ ,శ్రీనివాస్ యాదవ్ కె.మైపాల్ యాదవ్,శబరీష భజన మండలి సురేష్ గౌడ్, విశ్వనాథ్, కుమార్, మొరంపల్లి వెంకటేష్, అరుణ్ నరసింహులు,అయ్యప్ప స్వాములు,ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..