బాల్య వివాహాల పై విద్యార్థులకు అవగాహన :

బాల్య వివాహాల పై విద్యార్థులకు అవగాహన :
జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14:
నారాయణపేట మండలం పెరపళ్ళ గ్రామంలోని రైతు వేదికలో షి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించినట్లు హెడ్ కానిస్టేబుల్ బాలరాజు తెలిపారు. బాల్య వివాహాలు చేయడంతో అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే తప్పుడు ఆరోపణలు తల్లి దండ్రుల మాట , పొరుగు మాట వింటూ మీ జీవితాలను పాడు చేసుకోవద్దని తెలుపుతూ ,బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైన బాల్య వివాహాలు జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఉపాధ్యాయులకు ,గ్రామస్తులకు పోలిసులు తెలిపారు.