కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
జ్ఞాన తెలంగాణ – బోధన్
కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎరువుల పంపిణీ సేవలను సొసైటీలు సద్వినియోగం చేసుకోవాలని కోరమండల్ జోనల్ మేనేజర్ మనోజ్ కుమార్ అన్నారు ఆదివారం బోధన పట్నంలోని రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ బోధనలో రేక్ ప్రారంభించడం మూలంగా చుట్టుపక్కల ఉన్న సొసైటీలకు, ఫర్టిలైజర్ డీలర్స్ ఉపయోగకరంగా ఉంటుందని దానిని సద్వినెయోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ కన్నా కూడా బోధన్ సమీపంలో ఉండడం ట్రాన్స్పోర్ట్ ఛార్జిలు తగ్గుతాయని అన్నారు. కావున వెంటనే చుట్టుపక్కల ఉన్న డీలర్స్ , సొసైటీలకు ఫెర్టిలైజర్ అందుబాటులోకి వస్తుందని అన్నారు.అనంతరం డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ బోదన్ లో రైల్వే లైన్ రేక్ ద్వారా మొట్టమొదటిసారిగా అందుబాటులోనికి తెచ్చిన కోరమండల్ ఇంటర్నేషనల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీలకు ట్రాన్స్పోర్ట్ చార్జిలు తగ్గి కొంత ప్రయోజనం చేకూరుతుందని , అంతేకాకుండా సొసైటీలకు, డీలర్లకు, రైతులకు ఎల్లప్పుడూ ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉంటాయని అన్నారు. బోధన్ లోని లారీ ఓనర్స్ కి, హమాలీలకి కొంత బిజినెస్ ఎక్కువగా జరుగుతుందన్నారు . కాబట్టి రేక్ ఏర్పాటు చేయడం రైతులకి చుట్టుపక్కల ఉన్న డీలర్ల కి చాలా లాభదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ రాము, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి , కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, బోధన్ అగ్రికల్చర్ ఆఫీసర్ సంతోష్ , నిజామాబాద్ దీపక్ అగర్వాల్ ఓంకార్ డీలర్స్, బోధన్ శ్రీనివాస డీలర్స్ , డ్రైవర్స్,హమాలీలు పాల్గొన్నారు .