మళ్లీ వరంగల్ సీపీగా ఏవి రంగనాథ్…?

జ్ఞావ తెలంగాణ హనుమకొండ

ఉత్తర తెలంగాణ ఐజిగా కొనసాగుతున్న ఏవి రంగనాథ్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమించేందుకు సంఘం సిద్ధమైనట్లు సమాచారం. వరంగల్ కమిషనర్ గా పనిచేసిన ఏవి రంగనాథ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ కు ఐజిగా పదోన్నతి పొందారు. ఐజీగా కొనసాగుతున్న ఏవి రంగనాథను మళ్లీ వరంగల్ కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.ఈ మేరకు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గా పేరు ఉన్న ఓ నేత, జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే రంగనాథను కమిషనర్ గా నియమించేందుకు స్వయంగా రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వరంగల్ సిపిగా రావడం దాదాపు ఖాయంన్న చర్చ పోలీస్ అధికారుల మధ్య నడుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో రంగనాథ్ నియామకంపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడి అవకాశం ఉందని తెలుస్తుంది. వరంగల్ సిపిగా ప్రత్యేక ముద్ర వేసుకున్న రంగనాథన్, తన దూకుడుతో వరంగల్ ప్రజలకు నుంచి మన్ననలు అందుకున్నారు.ముఖ్యంగా భూకబ్జాలకు పాల్పడిన వారిని ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అప్పటినుండి ఆయన నేరుగా ప్రజలు,బాధితులతో నేరుగా మాట్లాడేవారు.వారి నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటికి పరిష్కారం చూపేవారు. ప్రజా అర్జీలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేయడం గమనార్హం.సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూ కబ్జాదారులకు దడ పుట్టించారు.వరంగల్ కమిషనర్ గా 2022 డిసెంబర్ 3న ఏవి రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు.ప్రజల నుంచి సిపి స్వయంగా 2500కు పైగా ఫిర్యాదులను స్వీకరించడం గమనార్హం. వరంగల్ లో ప్రైవేట్ చిట్టి ఫండ్స్ కంపెనీలు వినియోగదారులకు చిట్టే డబ్బులు ను ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్టి ఫండ్ యజమానియాలపై కేసులు నమోదు చేసి పంపారు. ప్రతినెల చిట్టి డబ్బులు చెల్లించేలా డీసీపీ స్థాయి అధికారితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను మోసం చేసి చిట్ ఫండ్ నిర్వాహకుల నుంచి సుమారు 200 కోట్లు ప్రజలకు అందేలా చేశారు.

You may also like...

Translate »