కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల శ్రీను పై దాడి. అండగా గ్రామ ప్రజలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల శ్రీను పై దాడి. అండగా గ్రామ ప్రజలు
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/ అశ్వరావుపేట (ఆసుపాక) న్యూస్:
ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన నాపై దాడులు ఎందుకు అని ప్రశ్నించారు? ఈ పది సంవత్సరాలు ఆర్థికంగా సామాజికంగా ఎంతో నష్టపోయి ఉన్నా నేను నాపై ఎందుకు కక్ష సాధింపు ఎందుకానీ, ఆసుపాక గ్రామ ప్రజల కొరకు నిరంతరం అందుబాటులో ఉంటున్న నేను నాపై ఎందుకు దాడి చేశారు, నాపై దాడి చేయుట కొరకు కారణాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి గౌరవం లేకుండా మమ్మల్ని వేరే పార్టీ నాయకులకు చూడటం తగదని పార్టీని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోని ఉంటున్న మాకు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపు లక్ష్మణరావు, నల్లపు జగన్, బైగాని రాము, పుచ్చకాయల రమేష్ అంటున్నారు. అయినా గ్రామాల్లో ఎప్పుడు లేనివిధంగా దాడులకు తెగబడుతున్నారని. ఇలాంటి సంస్కృతి గ్రామంలోకి తీసుకొచ్చారని అటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉండదు నాపై దాడి ఎందుకు చేశారో కూడా తెలియదని అంటున్నా డు. గ్రామ ప్రజలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీలకతీతంగా కొప్పుల శ్రీనుకు అండగా బి ఆర్ ఎస్ నాయకులు బయ్యా సత్యనారాయణ, పినబోయిన సత్యనారాయణ, బుసనబోయిన నాగేశ్వరరావు, బొచ్చుల మంగరాజు తదితరులు మద్దతు తెలుపుతున్నారు.
