మీర్పేటలో దారుణం మీర్పేటలో మహిళా దారుణ హత్య

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న

మీర్పేట పోలీసులు

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల కేంద్రం మీర్పేట మున్సిపల్ పరిధిలో దారుణ హత్య జరిగింది.కూతురినిచ్చిన కుటుంబంతో ఉన్న కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి వియ్యపురాలిని దారుణంగా హత్య చేశాడు. కూతురును చూడడానికి వచ్చి వియ్యపురాలి తలపై సుత్తితో దాడి చేసి కడతేర్చాడు. ఈ సంఘటన మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల కేంద్రం మీర్పేట మున్సిపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మహేశ్వరం మండలం కెసి తాండాకు చెందిన జరావత్ ప్రభు (45) రెండేళ్ళ క్రితం తన కూతురిని అల్మాస్గూడ వినాయక హిల్స్ లో నివస్తున్న కొర్ర జయరాంతో వివాహం జరిపించాడు. అయితే అప్పటి నుండి అల్లుడి కుటుంబంతో ప్రభుకు విభేదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం తన భార్య శాంతితో కలిసి కూతురును చూడానికి వచ్చిన తండ్రి ఆ సమయంలో అల్లుడి తల్లి అయిన వియ్యపురాలు కొర్ర లలితతో గొడవ పడ్డాడు దీంతో కోపం పట్టలేని ప్రభు ఆమెను తోసివేయగా కింద పడింది. అనంతరం ఆమెపై సుత్తితో దాడి చేసి తలపై బలంగా కొట్టాడు దీంతో లలిత అక్కడికక్కడే మృతి చెందింది.

హత్య జరిగిన సమాచారం అందుకున్న మీర్పేట్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ సిబ్బందితో కలిసి సంఘటనా ప్రాంతానికి టీంతో దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీర్ పేట పోలీసులు తెలిపారు.

You may also like...

Translate »