గవర్నర్ ఆమోదిత ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్న ఆర్మీ రవి

గవర్నర్ ఆమోదిత ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్న ఆర్మీ రవి
- 52 సార్లు రక్తదానం చేసినందుకు అవార్డుకు ఎంపిక
- రాజ్ భవన్ సంస్కృతి ఆడిటోరియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డు అందజేత.
- భవిష్యత్తులో ఎక్కువ మందికి రక్తదానం చేయడమే నా లక్ష్యం: ఆర్మీ రవి
జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్:ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలోని రాజ్ భవన్ సంస్కృతి ఆడిటోరియంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అందజేసిన రాష్ట్ర గవర్నర్ ఆమోదిత ఉత్తమ రక్తదాత అవార్డుకు ఆర్మీ రవి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. 52 సార్లు రక్తదానం చేసిన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుద్దవాగుతండాకు చెందిన ఆర్మీ రవి(బానోతు రవి)ని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఉత్తమ రక్తదాతగా ఎంపిక చేశారు. ఈ ఎంపికలో భాగంగా శుక్రవారం రాజ్ భవన్ సంస్కృతి ఆడిటోరియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డుతో పాటు షీల్డ్ ను అందజేశారు. జూన్ 14న ఆర్మీ రవి పుట్టిన రోజు కావడంతో ఆడిటోరియంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆర్మీ రవి మాట్లాడుతూ 52 సార్లు రక్తదానం చేయడం సంతోషంగా ఉందని, ఎంతో మంది అత్యవసర చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేసి వారికి నా వంతుగా సహాయపడ్డానానే సంతృప్తి ఉందన్నారు. ఆర్మీ యూత్ ఆర్గనైజేషన్ పేరుతో ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తలసేమీయా బాధితులకు రక్తదానం చేపిచ్చామని, భవిష్యత్తులో బ్లెడ్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్తదానం చేయ్యాలనిది నా కోరిక అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ వి కర్ణన్, గవర్నర్ కార్యలయ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, రెడ్ క్రాస్ సొసైటీ ఖమ్మం జిల్లా చైర్మన్ చంద్రమోహన్, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి బ్లెడ్ బ్యాంకు ఇంచార్జ్ డాక్టర్ బాలు, బిఆర్ఎస్ పార్టీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బొడ మంచ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
