కాలువపైనే యథేచ్ఛగా రేకుల షెడ్డు నిర్మాణం

కాలువపైనే యథేచ్ఛగా రేకుల షెడ్డు నిర్మాణం

  • ఆక్రమణకు పంచాయతి సిబ్బంది సహకారం
  • కాలువపై నిర్మించిన రేకుల షెడ్డు

జ్ఞానతెలంగాణ – బోధన్ : ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కాలువలను ఆక్రమించిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటూ ఆక్రమణలు తొలగిస్తుంటే సాలూర గ్రామంలో మాత్రం పంచాయతి సిబ్బంది కళ్లముందే కాలువల ఆక్రమణలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. సాలూర గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే గల కాలువపై ఓ వ్యక్తి యథేచ్ఛగా రేకుల షెడ్డు నిర్మాణం చెపట్టారు. అయిన ఎవరు పట్టించుకోరు.పంచాయతి సిబ్బంది సహకారంతో సదరు వ్యక్తి దర్జాగా కాలువపైనే రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకోవాల్సిన పంచాయతి సిబ్బంది ఆక్రమణదారులకు సహకరించడం విమర్శలకు తావీస్తుంది. ప్రభుత్వ స్థలాలను, కెనాల్ లను ఆక్రమించి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంటే సాలూరలో యథేచ్ఛగా కాలువలపై నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై పంచాయతి కార్యదర్శి ప్రవీణ్ ను వివరణ కోరగా కాలువపై నిర్మాణం తన దృష్టికి రాలేదని దానిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

You may also like...

Translate »