తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు

తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు
హైదరాబాద్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి..
డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్ ఛైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.