AP 10th Supply Exam Schedule 2024:

AP SSC 10th Class Result 2024: ఈ రోజు విడుదలైన ఏపీ టెన్త్‌ ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత (86.69 శాతం) శాతం నమోదైంది. ఉత్తీర్ణత పొందిన 5,34,574 విద్యార్ధుల్లో 69.26 శాతం మంది విద్యార్ధులు ఫస్ట్‌ క్లాస్‌, 11.87 శాతం సెకండ్ క్లాస్‌, 5.56 శాతం థార్డ్‌ క్లాస్‌లో పాసైయ్యారు. ఇక 100 శాతం ఉత్తీర్ణత పొందిన 2803 స్కూల్స్‌లో ప్రభుత్వ పాఠశాలలు 12, జిల్లా పరిషత్‌ పాఠశాలలు 436, మోడల్ స్కూల్స్‌ 37, మున్సిపల్‌ స్కూల్స్‌ 8, రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ 28, సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్ 42, ట్రైబల్‌ స్కూల్స్‌ 28, కేజీబీవీ స్కూల్స్‌ 75, బీసీ స్కూల్స్‌ 54, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ 26, ప్రైవెట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ 1988, ఆశ్రమ పాఠశాలలు 69 ఉన్నాయి. జీరో పరైంటైల్‌ పొందిన 17 పాఠశాలల్లో 13 ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, 3 నంకూఎయిడెడ్, 1 ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉన్నాయి.

రాష్ట్రంలోని 12 రకాల మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం ఇలా..

ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 98.43 శాతం ఉత్తీర్ణత
ఏపీ బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 98.43 శాతం ఉత్తీర్ణత
ఏపీ ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ 96.72 శాతం ఉత్తీర్ణత
ఏపీ మోడల్‌ స్కూల్స్‌ 92.88 శాతం ఉత్తీర్ణత
ఏపీ సోషల్ వెల్‌ఫేర్‌ స్కూల్స్‌ 94.56 శాతం ఉత్తీర్ణత
ఏపీ ఆశ్రమ పాఠశాలలు 90.13 శాతం ఉత్తీర్ణత
ఏపీ కస్తూర్బా బాలిక పాఠశాలలు 88.96 శాతం ఉత్తీర్ణత
ఏపీ ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ పాఠశాలలు 89.64 శాతం ఉత్తీర్ణత
ఏపీ జిల్ల పరిషత్ హై స్కూల్స్‌ 73.38 శాతం ఉత్తీర్ణత
ఏపీ ప్రైవెట్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ 80.01 శాతం ఉత్తీర్ణత
ఏపీ మున్సిపల్‌ స్కూల్స్‌ 75.42 శాతం ఉత్తీర్ణత
ఏపీ గవర్నమెంట్ హై స్కూల్స్‌ 74.40 శాతం ఉత్తీర్ణత.

ఇక ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. మే 24 నుంచి జూన్‌ 3 వరకు పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. రేపట్నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. అలాగే రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు కూడా అప్లికేషన్ ప్రాసెస్ రేపట్నుంచే ప్రారంభం అవుతుంది. విద్యార్దులు సంబంధిత స్కూళ్ల ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సె్స్సీ బోర్డు స్పష్టం చేసింది.

You may also like...

Translate »