AP Polycet 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ హాల్‌టికెట్లు విడుదల..

AP Polycet 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ హాల్‌టికెట్లు విడుదల..
ఏప్రిల్ 27న రాత పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (AP SBTET) అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పదో తరగతి హాల్‌టికెట్ లేదా మొబైల్ నంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలిసెట్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.