ఏపీ ఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో జరగబోయే ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వాలపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఏపీలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలనేదే మా ప్రణాళిక. పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై మా దృష్టి ఉంది.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

You may also like...

Translate »