ఏసీబీకి చిక్కిన నానాజీపూర్ కార్యదర్శి

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ రూరల్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీ పూర్ గ్రామపంచాయతీలో ఎసిబి అధికారుల దాడులు నిర్వహించారు. ఇంటి అనుమతుల కోసం వ్యక్తి వద్ద 35000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్, పంచాయతీ సెక్రెటరీ…ఎసిబి డిఎస్పి అందించిన వివరాల ప్రకారం
నాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలో హైదరాబాద్ కు చెందిన బర్కత్ అలీకి 500 గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో కాంపౌండ్ వాల్ తోపాటు చిన్న రూమ్ వేసుకోవడానికి గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికను సంప్రదించగా
ఆమె అనుమతి ఇవ్వాలంటే 60 వేలు లంచం ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో బర్కత్ అలీ తాను అంత ఇవ్వలేనని చెప్పడంతో ఆమె బిల్ కలెక్టర్ బాల్ రాజ్ ను కలవాల్సిందిగా కోరింది. బాధితుడు బర్కత్ అలీ కి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించాడు. తనను ఇంటి అనుమతి కోసం బిల్ కలెక్టర్ బాల్ రాజ్, సెక్రెటరీ రాధిక లంచం అడిగారని వివరించాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి డిఎస్పి ఆనంద్ ఈరోజు నానాజీపూర్ గ్రామపంచాయతీ లో బిల్ కలెక్టర్ బాల్ రాజ్ 35 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like...

Translate »