అమ్మ, ఆదర్శ పాటశాల కాంట్రాక్టుర్ల సమావేశం.

అమ్మ, ఆదర్శ పాటశాల కాంట్రాక్టుర్ల సమావేశం.
జ్ఞాన తెలంగాణ కసముద్రం,
30.
ఈరోజు కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల అమ్మ. ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు కాంట్రాక్టర్ల సమావేశం కేసముద్రంలోని రైతువేదికలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేసముద్రం మండల స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. టి.శాంతకుమారి గారు మరియు పంచాయితీ రాజ్ డి.ఇ. రాజలింగం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతకుమారి గారు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎంపికైన వివిధ పనులను జూన్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరియు పాఠశాలల బ్యాంక్ అకౌంట్లో జమయిన అడ్వాన్సులను పనులు పూర్తి చేస్తున్న మేరకు వెంటనే చెల్లించి మిగిలిన పనులను చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో కేసముద్రం మండల నోడల్ ఆఫీసర్ కె.జగన్మోహన్ రెడ్డి గారు, ఇనుగుర్తి మండల నోడల్ ఆఫీసర్ జె.మంగతాయి గారు, ఎం.పీ.ఓ. ప్రసాద్ గారు, జిల్లా పరీక్షల బోర్డ్ చైర్మన్ ఎం.విజయసుశీల గారు, ఎ.ఇ.ఇ. మానస గారు, ఎం.ఐ.ఎస్. కోఆర్డినేటర్ ఖాదర్, ఐకెపి ఎ.పి.ఎం. రాజీర్ మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.