అమెరికా ఆటా – 2024 వేడుకలకు బయలుదేరిన

రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహా రెడ్డి

జ్ఞాన తెలంగాణ, (కడ్తాల్)

అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జూన్ 7- 9, 2024 తేదీలలో అమెరికా జార్జియా రాష్ట్రం,అట్లాంటా నగరంలో జరిగే 18వ అమెరికా తెలుగు యూత్ కన్వెన్షన్ లో పాల్గొనడానికి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి అమెరికా బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు తెలుగు రాష్ట్రాలలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటా వేడుకలలో తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు సేవే పరమావధిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ సొంత గడ్డపై వారికున్న మమకారాన్ని చాటుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 2019 వ సంవత్సరంలో ఆటా – 2020 వేడుకలకు ప్రీమియర్ స్పాన్సర్ గా కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి వ్యవహరించి ప్రవాస భారతీయుడు,అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి కిషోర్ గూడూరు ద్వారా మండల కేంద్రంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. 2019,2021,2023 సంవత్సరాలలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు,మంచినీటి సౌకర్యాలు,విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూలు బ్యాగులు,కరోనా సమయంలో కరోనా కిట్లు, నిరుపేదలకు వృత్తిపరమైన పనిముట్లు మరియు ప్రమాదాల నివారణలో పోలీసు వారు వినియోగించే వేగ నియంత్రికలు అందజేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. నవత,యువత, భవిత అనే నినాదంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అమెరికాలో జరిగే ఆటా – 2024 వేడుకలలో పాల్గొని ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో మన ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రవాస భారతీయులతో చర్చించనున్నట్లు తెలిపారు. ఆటా వేడుకలలో పాల్గొనేందుకు సహకరించిన గ్రామస్తులకు,అభిమానులకు, అధికారులకు,అనధికారులకు, పత్రికా మరియు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆటా వేడుకలలో పాల్గొనేందుకు అమెరికా బయలుదేరిన లక్ష్మీ నర్సింహా రెడ్డిని గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు గురిగళ్ళ జంగమ్మ రాంచంద్రయ్య, మూడ అశోక్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like...

Translate »