శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి

శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ 68 వ వర్ధంతి


ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండి చెర్ల గోవర్ధన్ రెడ్డి, పట్టణ ప్రజలు పాఠశాల విద్యార్థుల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటమంతా బహుజనుల రాజ్యాధికార దిశగానే సాగిందని, రాజ్యాధికారమే వారికి సంపదను సమతను ఇస్తాయని అహర్నిశలు కృషి చేశారు. ఆయన బాల్య దశ నుండి కూడా, తనకు ఎదురైన ప్రతి సంఘటనను మొత్తం సమాజపరంగా చూసి, దాని మీదే పోరాడే తత్వాన్ని అలవర్చుకున్నాడని అన్నారు. తన
తండ్రి యొక్క క్రమశిక్షణతో కూడిన జీవితమే అంబేద్కర్ లో ప్రతి ఫలించిందని, సాధారణంగా చాలామంది వ్యక్తిగత స్వార్థంతో జీవిస్తారు కానీ, ఆయన సామాజిక స్పృహతో జీవించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గండిచెర్ల, వెంకటయ్య, రామచందర్, శంకరయ్య , రాజేశ్వర్, చంద్ర శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు.

— Nani Ratnam

You may also like...

Translate »