అలుగు వర్షిని బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం వెనక్కి తీసుకోవాలి.

అలుగు వర్షిని బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం వెనక్కి తీసుకోవాలి...
- దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు భారత రాజ్యాంగ తరగతుల శిక్షణనే శరణ్యం.
- సైన్స్ వదిలి సనాతనం వైఫై పయనం సమంజసం కాదు
- గిద్ద విజయ్ కుమార్ స్వేరో రాష్ట్ర నాయకులు.
జ్ఞానతెలంగాణ, జోగులాంబ : బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందాన్ని రద్దుచేసి సైన్సు పై విద్యార్థులకు మరియు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని గిద్ద విజయకుమార్ స్వేరో తెలంగాణ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఫుడ్ పాయిజన్ ద్వారా విద్యార్థులు చనిపోవడాలు నేటికీ అడ్మిషన్స్ ల ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో పేరుగాంచిన పాఠశాల గౌలిదెడ్డి లో నీటి కొరత తదితర సమస్యల తో విద్యార్థులు సతమతమవుతున్న పట్టించుకోలేని కార్యదర్శి అలుగు వర్షిని ఐఏఎస్ విద్యార్థుల భవిష్యత్తు చీకటి కోణంలోకి నెట్టి వేయడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో 33 సీఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ కాలేజీలల లో చదివిన విద్యార్థులు గొప్ప ఇంజనీర్లుగా డాక్టర్లుగా గొప్ప గొప్ప యూనివర్సిటీలలో సీట్లు సాధించడం జరిగింది అలాంటి సి ఓ ఈ కాలేజీలను ఫైన్ ఆర్ట్స్ కోడింగ్ పాఠశాలలను తీసివేసి ఇష్ట రాజ్యానికి సైన్స్ ను వదిలి సనాతనం వైపు పయనం బ్రహ్మకుమారి సంస్థతో ఎవరి ఆలోచన మేరకు ఒప్పందం కుదుర్చుకొని సెప్టెంబర్ 2న స్టార్ట్ చేయబోతున్న మీ విగంతపు ఆలోచనలను వెనక్కి తీసుకొని చాతనైతే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రస్తుతం నీట్ ఎన్ఐటి జేఈఈ మెయిన్స్ కోచింగ్ 395 మందికి మాత్రమే ఇస్తున్నారు సంవత్సరానికి 1000 మందికి కోచింగ్ ఇప్పిస్తూ సరైన వనరులు కల్పిస్తూ ఫైన్ ఆర్ట్స్ కోడింగ్ పాఠశాలల్లో యధావిధిగా తరగతులు నిర్వహిస్తూ అవసరమైతే దేశంలో జరుగుతున్న అత్యాచారాలు కొంతమేరకు అరికట్టడానికి భారత రాజ్యాంగంపై శిక్షణ తరగతులే శరణ్యం తరగతులు నిర్వహిస్తే తప్పు చేస్తే తప్పదు శిక్ష అనే విధంగా తయారవుతూ అవగాహన కలిగి విద్యార్థులు భవిష్యత్తులో జాగ్రత్తగా మెలగడానికి చాలా అనుసంధానమైన మార్గం భారత రాజ్యాంగమే కాబట్టి బ్రహ్మకుమారి సంస్థతో ఒప్పందం రద్దు చేస్తూ సి బి సి ఎస్ సిలబస్ మొదలు పెట్టండి అవసరమైతే ప్రతి నెలలో ఒక రోజు కార్యదర్శిగా ఒక గురుకుల పాఠశాలల్లో నిద్ర చేసి విద్యార్థులతో ఫుడ్ఫెసిలిటీ నీటి ఇతర తర సమస్యలను దగ్గరుండి పరిశీలన చేయాలనీ అదేవిధంగా పేరెంట్ కమిటీ సలహాలు, స్వేరోస్ నెట్వర్క్ నాయకులతో సూచన సలహాలు పంచుకోవాలని బ్రహ్మకుమారి సంస్థ ఒప్పందం వెనక్కి తీసుకోవాలని లేదంటే మా పేద విద్యార్థుల కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తూ గిద్ద విజయ్ కుమార్ స్వేరో రాష్ట్ర నాయకులు మాట్లాడారు.